కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వీధి వ్యాపారులకు ఆగస్టు 15 లోగా రుణాలు వంద శాతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్లో మున్సిపల్ కౌన్సిలర్లు, మెప్మా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా అర్హత ఉన్న వీధి వ్యాపారులు అందరికీ బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. నిరుపేదలకు రుణాలు ఇచ్చి వ్యాపారాలు చేసే విధంగా చూడాలన్నారు.
వార్డుల్లో పార్కు ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021