కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు టిఎన్ఎస్ఎఫ్ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా నాయకులు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢల్లీి వరకు తన వాణి వినిపించిన మహోన్నతమైన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. సార్ ఆశించిన తెలంగాణ ఇది కాదని తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఆంధ్ర ఉద్యోగులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతారని ఆశిస్తే అవేవీ ఇప్పుడు అమలు కాకుండా తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ సార్‌కి ట్యాంక్ బాండ్‌పై కడతామని చెప్పిన విగ్రహం కూడా ఏర్పాటు చేయలేకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. జయశంకర్ సార్ ఆశించిన తెలంగాణ సాధనకై వారి స్ఫూర్తితో ముందుకు కదులుతామన్నారు. కార్యక్రమంలో రాజు, సతీష్ పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021