Breaking News

వైరస్‌ నివారణ చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల‌ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల‌ రాజేందర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లాలో కోవిడ్‌ మేనేజ్‌ మెంట్‌ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా ఆస్పత్రుల‌ సూపరింటెండెంట్ ల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ, స్థానిక జిల్లా మంత్రుల సల‌హాలు, సూచనల‌తో జిల్లాలో కరోనా వైరస్‌ నివారణ చర్యలు చేపట్టాల‌ని కలెక్టర్లను కోరారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యుల‌ర్‌గా మానిటర్‌ చేయాల‌ని డాక్టర్లతో తగు కౌన్సిలింగ్‌ అందించాల‌ని కలెక్టర్లను ఆదేశించారు. పేషెంట్లందరికి అవసరమైన చికిత్స అందించి వారిలో భరోసా కల్పించాల‌న్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో టెస్టింగ్‌ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టింగ్‌ చేయడంతో పాటు ఆప్‌లో తప్పని సరిగా వివరాలు నమోదు చేయాల‌న్నారు.

పాజిటివ్‌ పేషెంట్లకు కౌన్సిలింగ్‌తో పాటు మెడికల్‌ కిట్‌ అందజేయాల‌న్నారు. క్రొత్త టెస్టింగ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం తగు వివరాల‌తో ప్రతి పాదనలు సమర్పించాల‌న్నారు. కోవిడ్‌ చికిత్సకు అవసరమైన వైద్యులు, మెడికల్‌ సిబ్బందికి తాత్కాలిక పద్దతిలో నియమించడానికి అవసరమైన ప్రతిపాదనలు పంపితే తగు అనుమతులు ఇస్తామన్నారు. కోవిడ్‌ చికిత్సకు దరఖాస్తు చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రుల‌ అనుమతి ప్రతిపాదనలు సమర్పించాల‌న్నారు.

జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అనుబంద ఆస్పత్రుల‌లో ఉన్న అన్ని బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం కల్పించడానికి ప్రతిపాదనలు సమర్పించాల‌ని ఆదేశించారు. కోవిడ్‌ చికిత్సకు సంబంధింత పెండిరగ్ బిల్లులు తగు ప్రొఫార్మలో సమర్పించాల‌న్నారు. ఐసోలేషన్‌ కిట్లు అందజేసే మందుల‌ వివరాల‌కు సంబంధించి సర్కూల‌ర్‌ను రూపొందించాల‌ని కోవిడ్‌కు సంబంధించిన ట్రీట్‌ మెంట్‌ ప్రోటో కాల్‌పై నిబంధనలు రూపొందించాల‌ని వైద్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆసుపత్రిలో టెస్టులు నిర్వహిస్తున్నామని, మెడికల్‌ కాలేజీ, ఆర్మూర్‌ బోధన్‌ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించామని, జిల్లాలో 100 పడకల‌ ఐసోలేషన్‌ సెంటర్‌ ప్రారంభించామని, బోధన్‌, ఆర్మూర్‌లో వసతి సిద్ధం చేశామని అవసరాన్ని బట్టి వాటిని ఐసోలేషన్‌ సెంటర్లుగా ప్రారంభిస్తామన్నారు. జిజిహెచ్‌ లో 270 బెడ్లకు గాను 176 బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్నదని, మిగిలిన బెడ్లకు రెండు రోజుల్లో కల్పిస్తామని, మిగిలిన సెంటర్లలో 10 బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్నదని, మిగిలిన 20 బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.

మెడికల్‌ కాలేజీ హాస్పిటల్లో 60 ఐసియు బెడ్స్‌ ఉన్నాయని, త్వరలో మరో 180 బెడ్స్‌ రెడి చేసి పడకల‌ సంఖ్యను 450కి పెంచుతామన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఐసోలేషన్‌ కిట్స్‌ ఎప్పటికప్పుడు అందచేస్తున్నామని, జిల్లాలో గుర్తింపు ఇచ్చిన 4 ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో రెండిరటిలో 59 మంది పేషెంట్లు ఇప్పటికే ఉన్నారని, హాస్పిటల్స్‌కు టెస్టింగ్‌ లాగిన్స్‌ ఇవ్వాల‌న్నారు. సమావేశంలో నిజామాబాద్‌ జిల్లా నుండి ఇంఛార్జి జిల్లా వైద్యాధికారి రమేష్‌, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమా రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ గ్రామానికి చెందిన ...

One comment

  1. RAKESH.E

    SIR IN NIZAMABAD 70 PERCENT WILL HAVE CARONA POSITIVE.WE ARE IN MOST DANGEROUS SITUATION.

Leave a Reply to RAKESH.E Cancel reply