Breaking News

15న ప్రమాణాలు చేయించాలి

కామారెడ్డి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గందగీ ముక్తి భారత్‌ (జిఎంబి) కార్యక్రమంలో భాగంగా ఈ నెల‌ 8 నుండి వారం రోజుల‌ పాటు ప్రజల‌కు పారిశుద్యంపై అవగాహన కలిగించేందుకు వారోత్సవాలు నిర్వహించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మండల‌ అభివృద్ధి అధికారుల‌ను ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఆగష్టు 8 వ తేదీన సర్పంచ్ల‌‌తో సమావేశాలు నిర్వహించాల‌ని, 9 వ తేదీన సర్పంచ్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించాల‌ని, వాటి నుండి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వేరు చేయడంపై అవగాహన కలిగించాల‌ని తెలిపారు.

10 వ తేదీన గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రభుత్వ కార్యాల‌యాల‌ను శుభ్రం చేసేందుకు శ్రమదానం కార్యక్రమం చేపట్టాల‌ని, శ్రమదానం చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నెంబరు 1800800404 కేటాయించడం జరిగిందని తెలిపారు. 11 వ తేదీన పరిశుభ్రతపై ప్రేరణ కలిగించేలా ప్రజలంతా ఉద్యమించేలా గ్రామాల‌లో గోడల‌పై వాల్‌ పెయింటింగ్స్‌ రాయించాల‌ని, 12 వ తేదీన మొక్కలు నాటడం, శ్రమదానం నిర్వహించాల‌ని చెప్పారు.

13 వ తేదీన నా గ్రామం మురికి రహితం అంశంపై 6,7 తరగతుల‌ విద్యార్ధుల‌కు పెయింటింగ్‌, 9,10 వారికి వ్యాసరచన పోటీల‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాల‌ని, 14వ తేదీన పి .హెచ్‌ సి.లో పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాల‌న్నారు. 15 తేదీన గ్రామ సభలు నిర్వహించి ప్రమాణాలు చేయించాల‌ని మార్గదర్శకాల‌లో తెలిపారు. వారోత్సవాల‌ కార్యక్రమాల‌కు సంబంధించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా పంచాయితీ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికార్లను ఇన్‌చార్జి అధికారులుగా నియమిస్తూ కార్యక్రమాల‌ను పర్యవేక్షించాల‌ని ఆదేశించారు.

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article