కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వేదికల నిర్మాణ పనులు ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మాచారెడ్డి మండలం భవానీపేట, పాల్వంచ, ఫరీదుపేట లచ్చాపేట గ్రామాలలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఈ నెల 25 లోగా నిర్మాణాలు పూర్తి కావాలని పంచాయితీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు.
రైతు వేదికల చట్టూ పచ్చదనం పెంపొందించాలని, పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి నరేందర్, తహశీలుదారు శ్రీనివాసరావు ఎంపిడిఓ బాలకృష్ణ, పంచాయితీరాజ్ అసిస్టెంట్ ఇంజనీరు, వైస్ ఎంపిపి నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021