కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో గుడి, బడి బంద్ ఉన్న వేళ మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్ధి పరిషత్ టిజివిపి ప్రొబిషనల్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు.
అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్ కార్ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంబిసున్న వేళ పట్టణ వాసులందరు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించి ఇళ్లకే పరిమితమైన తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశ అనంతరం విధించిన లాక్ డౌన్లో కేవలం కూరగాయలు, పాలు, మెడికల్ వారికే మినహాయింపు ఉందని, జిల్లాలో కేసులు పెరగటానికి దాదాపు మందు పార్టీలే కారణమని గుర్తుచేసారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు కృష్ణ ప్రసాద్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021