Breaking News

15లోపు ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్తను విడదీసే ప్రక్రియ ఆగస్టు 15 వ తేదీలోపు మొదల‌వ్వాని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎంపీవోలు, పంచాయతీ అధికారుల‌తో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్వహణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలో దాదాపు 400 గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్‌ షెడ్లు పూర్తి అయినాయని, మిగిలినవి త్వరలో పూర్తి కానున్నాయని, అన్ని గ్రామ పంచాయితీలో ఆగష్టు 15 తేదీ నుండి తప్పనిసరిగా చెత్తను విడతీసి రీసైక్లింగ్‌కు పంపేలా చర్యలు తీసుకోవాల‌ని, ఎంపీవోలు ఈ బాధ్యత తీసుకోవాల‌న్నారు.

కావల‌సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అంతా ఉన్నదని, డోర్‌ టు డోర్‌ చెత్తను సేకరించే సమయంలోనే తడి పొడి చెత్తను విడతీసి సేకరించాల‌ని, గ్రామ పంచాయతీ ఇచ్చిన చెత్త బుట్టలు వాడేలా చూడాల‌ని, సరిగ్గా బాధ్యతా యుతంగా చేస్తే గ్రామాన్ని అభివృద్ధి చెందిన దేశాల‌తో పోల్చ‌వచ్చన్నారు.

తడి చెత్తను కంపోస్ట్‌గా తయారు చేయాల‌ని, పొడి చెత్తను ఉపయోగపడే విధంగా విడదీయాల‌న్నారు. సెగ్రిగేషన్‌ షెడ్లో ఒక మనిషిని నియమించాల‌ని, అతనికి 3 వేల‌ రూపాయలు జిపి నుండి ఇవ్వాల‌ని, చెత్తను విడదీసి అమ్మిన మొత్తం అతనికే ఇవ్వాల‌న్నారు.

The following two tabs change content below.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article