Breaking News

త్వరలో ప్రారంభం….

నిజామాబాద్‌, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాల‌య నిర్మాణ పనుల‌ను రాష్ట్ర రోడ్లు-భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల‌ ముంగిటకే పాల‌న వెళ్లాల‌న్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలున్న తెలంగాణలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల తెలంగాణగా చేశారన్నారు.

అలా ఏర్పడిన జిల్లాలో ప్రజల‌ సౌకర్యార్థం ప్రభుత్వ ఫలాలు ఒకే గొడుగు కింద అందాల‌నే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్‌ కార్యాల‌యాల‌ నిర్మాణాల‌కు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు. 21 కొత్త జిల్లాలు, 5 పాత జిల్లాలు మొత్తం 26 జిల్లాల్లో నూతన కలెక్టరేట్‌ కార్యాల‌యాలు ఒక్కోటి దాదాపు ఒక ల‌క్ష 50 వేల‌ చదరపు అడుగుల‌ విస్తీర్ణంలో నిర్మాణాలు ప్రారంభమై పనులు శరవేగంగా జరుగుతున్నాయని వేముల‌ అన్నారు. ఈ ఇంటి గ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కార్యాల‌యాల్లో కలెక్టర్‌, అడిషినల్‌ కలెక్టర్‌ తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు అక్కడి నుండే పనిచేసే విధంగా, ప్రజలు వారి పనుల‌ నిమిత్తం కాళ్ళు అరిగేలా అక్కడా, ఇక్కడా తిరగకుండా ఒకే చోట వారి పనులు పూర్తి చేసుకునేలా కార్యాల‌యాలు పనిచేయనున్నాయని స్పష్టం చేశారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సమీకృత కలెక్టరేట్‌ కార్యాల‌యాలు లేవని, సిద్ధిపేట కలెక్టరేట్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించే అవకాశం ఉన్నందున ఈనెల‌ 15 లోపు అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల‌, రాజన్న సిరిసిల్ల‌, పెద్దపల్లి, వికారాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి కాబట్టి ఈనెల‌ 28 లోపు ప్రారంభించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, వరంగల్‌ అర్బన్‌, జనగాం, రంగారెడ్డి మిగతా సమీకృత కలెక్టరేట్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వివరించారు. నిజామాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌ దాదాపు పూర్తయ్యిందని, అప్రోచ్‌ రోడ్‌, కంపొండ్‌ వాల్‌ పనులు పూర్తి కావాల్సి ఉందని, అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

The following two tabs change content below.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article