Breaking News

12 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె

నిజామాబాద్‌, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ హమాలీల‌ గత వేతన ఒప్పందం డిసెంబర్‌ 31, 2019 తో ముగిసిందని, జనవరి 1, 2020 నుండి నూతన వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉందని, దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో సివిల్‌ సప్లైస్‌ రాష్ట్ర కమిషనర్‌కి, సివిల్‌ సప్లైస్‌ మినిస్టర్‌కి జిల్లా మేనేజర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అన్నారు.

శుక్రవారం నిజాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం ముందు సివిల్‌ సప్లై కార్పొరేషన్‌లో పనిచేస్తున్న హమాలీలు స్వీపర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల‌ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు నిర్ణయించడం జరిగిందని, దాంట్లో భాగంగానే శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం ముందు ధర్నా చేశామన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ దిగివచ్చి యూనియన్‌ నాయకత్వాన్ని పిలిచి మాట్లాడి హమాలీల‌ బస్తా రేటు క్వింటాలుకు 24 రూపాయలు పెంచాల‌ని ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాల‌ని, ఆరు ల‌క్షల‌ ప్రమాద నష్టపరిహార బీమా నమోదు చేయాల‌ని, లాక్‌ డౌన్‌లో పనిచేసిన వారందరికీ ఒక నెల‌ వేతనం ఇన్సెంటివ్‌గా ఇవ్వాల‌ని, రెండు జతల‌ యూనిఫాం, కుట్టు కూలీ 1200 రూపాయలు ఇవ్వాల‌ని అన్నారు. పది వేల‌ రూపాయల‌ బోనస్ అమలు చేయాల‌ని వెయ్యి రూపాయల విలువ చేసే ఒక కిలో స్వీట్‌ ఇవ్వాల‌ని, హమాలీల‌ను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాల‌ని, హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్‌ చేశారు

లేని పక్షంలో 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నర్సింగరావు యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం దేవేందర్‌, జిల్లా నాయకులు రంజిత్‌, పవన్‌, ఫారుక్‌ కార్మికులు తదితరులున్నారు.

The following two tabs change content below.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article