Breaking News

చేనేత మండలి రద్దు సరికాదు

నిజామాబాద్‌, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత అభివృద్ధి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అఖిల‌ భారత చేనేత మండలి రద్దు సరికాదని నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షుడు దీకొండ యాదగిరి అన్నారు. నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో శుక్రవారం కోటగల్లిలోని సంఘ భవనంలో చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాదు నగరానికి చెందిన చేనేత కార్మికుల‌ను సన్మానించారు.

అనంతరం యాదగిరి మాట్లాడుతూ చేనేత మండలి రద్దు వ‌ల్ల‌ చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత మండలిని యధాతధంగా ఉంచాల‌ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారని అన్నారు. కార్మికుల‌ను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల‌న్నారు.

నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హన్మాండ్లు, పద్మశాలి సంఘం ప్రతినిధులు బింగి ప్రకాశ్‌, సిలివేరి గణేష్‌, మచ్చ చంటయ్య, చింతల‌ గంగాదాస్‌, కైరంకొండ విఠల్‌, మెరుగు ల‌క్ష్మినారాయణ, భీమర్తి రవి, బ‌ల్ల ల‌క్ష్మిభాయి, నర్సయ్య, గెంట్యాల‌ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article