Breaking News

వీరిని ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్స్‌ ఫలితాల‌లో 296 ర్యాంక్‌ సాధించిన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం, మాచర్ల గ్రామానికి చెందిన సచిన్‌ను రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సన్మానించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తికి 296 ర్యాంకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

భవిష్యత్తులో సివిల్స్‌ అటెండ్‌ అయ్యే వారు వీరిని ఆదర్శంగా తీసుకోవాల‌న్నారు. దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డకు ఇంత ర్యాంకు రావడం గర్వించదగ్గ విషయమని మంత్రి చెప్పారు. సన్మాన కార్యక్రమంలో సచిన్‌ తండ్రి నెహ్రూ, టీఎన్జీవో అధ్యక్షులు అలుక కిషన్‌, కామారెడ్డి టీఎన్జీవో అధ్యక్షులు దయానంద్‌, మాల‌ మహానాడు సెక్రెటరీ దేవి దాసు, పద్మారావు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ...

Comment on the article