Breaking News

ధైర్యంగా కరోనాను ఎదుర్కొండి

నిజామాబాద్‌, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి వ్యాధిని నిర్మూలించడానికి ప్రజలందరూ ధైర్యంగా ఎదుర్కోవాల‌ని, వ్యాధి సోకగానే అధైర్య పడవద్దని, వ్యాధిగ్రస్తుని పట్ల ఎలాంటి వివక్షత చూపవద్దని, సరైన డాక్టర్ సల‌హాలు, సూచనలు పాటిస్తే కరోనాను జయించవచ్చని నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు, బాజిరెడ్డి హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు.

బాజిరెడ్డి గోవర్ధన్‌ కరోనా వ్యాధితో పోరాడుతున్న వారికి పలు సూచనలు చేస్తూ బాజిరెడ్డి హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ మెడిజన్‌ ధర్పల్లి ఫార్మసీలో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగా గ్లెన్‌ మార్కు వారి ఫెబి ఫ్లు మందులు ల‌భిస్తాయని, వ్యాధితో పోరాడుతున్న వ్యక్తి పాజిటివ్‌ రిపోర్ట్‌, మరియు ఆధార్‌ కార్డు, వివరాల‌తో వస్తే బాజిరెడ్డి హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వారికి మెడిసిన్‌ అందజేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మెడిజెన్‌ ఫార్మసీ జిల్లా ప్రతినిధి బంగారి నవీన్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article