Breaking News

పదిమంది కలెక్టర్లకు గ్రీన్‌ చాలెంజ్‌

కామారెడ్డి, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పదిమంది కలెక్టర్లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ చేశారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాల‌యంలో శనివారం 10 మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణే ల‌క్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తు తరాల‌కు పచ్చదనాన్ని కానుకగా అందించాల‌ని సూచించారు.

ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముమ్మరంగా చేపడుతున్నారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ చేసిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో ల‌క్షలాది మంది భాగస్వాముల‌వుతున్నారని, తాను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. తాను జిల్లాలోని రైతుబంధు సమితి కన్వీనర్‌కు గ్రీన్‌ ఛాలెంజ్‌ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 104 రైతు వేదికల‌ వద్ద ఒక్కొక్కరు మూడు మొక్కల‌ చొప్పున నాటాల‌న్నారు.

ఆధ్యాత్మికంగా వాతావరణం బాగుండాలంటే విత్తన గణపతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని కోరారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. విత్తనాలు ఉన్న గణపతిని పెట్టుకోవడం వ‌ల్ల‌ తొమ్మిది రోజుల‌పాటు పూజలు చేసి వచ్చిన వేప మొక్కల‌ను తమ ఇంటి పరిసరాల్లో నాటుకోవాల‌ని సూచించారు. వేప మొక్కను దేవుడు ఇచ్చినట్లుగా భావించి సంరక్షణ చేసుకోవాల‌ని కోరారు.

ఔషధ మొక్కల‌ను ఇంటి సమీపంలో నాటడం వ‌ల్ల‌ సీజనల్‌ వ్యాధులు దరిచేరవని పేర్కొన్నారు. అనంతరం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, వెంకటేష్‌ ధోత్రే, నిర్మల్‌, మంచిర్యాల‌, నిజామాబాద్‌, ములుగు, సిద్దిపేట, న‌ల్ల‌గొండ, నాగర్‌ కర్నూల్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణ సమతుల్య‌తను కాపాడటం కోసం ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి సంరక్షణ చేపట్టాల‌ని కోరారు.

The following two tabs change content below.

Check Also

25 లోగా పూర్తి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25 లోగా రైతు వేదిక భవన నిర్మాణాలు ...

Comment on the article