Breaking News

వారి వ‌ల్ల‌నే నేడు స్వేచ్ఛ

నిజామాబాద్‌, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తమలాంటి పెద్ద వ‌ల్ల‌నే ఈరోజు స్వేచ్ఛగా దేశ ప్రజలు అందరం ఉండగలుగుతున్నామని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఆలంబన ఆర్‌బివిఆర్‌ఆర్‌ సొసైటీ ముబారక్‌ నగర్‌ ఆశ్రమంలో కమ్మర్‌పల్లి మండలం హాస కొత్తూరు గ్రామానికి చెందిన హనుమంత్‌ రెడ్డి, స్వాతంత్ర సమరయోధుడిని సన్మానించారు.

ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఆగస్టు 15 సందర్భంగా నిర్వహించే స్వాతంత్య్ర సమరయోధుల‌ సన్మాన కార్యక్రమాన్ని కరోనా -19 కారణంగా వారి వద్దకే వెళ్లి నిర్వహించడం జరుగుతుందని, మహాత్మా గాంధీ బ్రిటిష్‌ వారు వెళ్లిపోవాల‌ని 1942 ఆగస్టు 8న క్విట్‌ ఇండియా ఉద్యమం లేవదీశారని, క్విట్‌ ఇండియా మూమెంట్‌ సందర్భంగా బ్రిటిష్‌ వాళ్లను తరిమికొట్టాల‌ని ఏదైతే గాంధీజీ అన్నారో ఆ నినాదాన్ని మొత్తం దేశం పాటించిందని, ఆ ఉద్యమానికి ప్రతీకగా రాష్ట్రప్రభుత్వం జిల్లాల్లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల‌ను సన్మానించు కోవడానికి ఆదేశాలు జారీ చేసిందని, అందుకనుగుణంగా ఆదివారం సన్మానించడం జరిగిందని చెప్పారు.

కార్యక్రమంలో ఆలంబన సొసైటీ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, ఏవో సుదర్శన్‌, సూపరింటెండెంట్‌ రషీద్‌, ఆర్‌ఐ మీర్‌ భాష, రఫత్‌ అలీ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article