Breaking News

కార్మికుల‌ సంఖ్య పెంచాలి

నిజామాబాద్‌, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఏఐటియుసి మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై ఓమయ్య, పి నర్సింగ్‌ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బెడ్‌ల‌కు సరిపడా కార్మికులు, సిబ్బంది లేరని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆసుపత్రి ఆవరణకు రావడానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆస్పత్రి సిబ్బంది తమ ప్రాణాల‌ను పణంగా పెట్టి కరోనా పేషెంట్లను బతికించడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

ఇదిలా ఉండగా ఆస్పత్రి నాలుగవ తరగతి సిబ్బందిపై కనీస కనికరము లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్‌ పేషెంట్‌ కేర్‌ సెక్యూరిటీ సిబ్బందికి రెండు నెలల‌ క్రితం ఇచ్చిన హామీలో భాగంగా పనిచేసిన ప్రతి కార్మికుడికి రోజుకు 300 ఇన్సెంటివ్‌ ఇవ్వాల‌ని, 15 రోజుల‌ డ్యూటీకి 15 రోజుల సెల‌వు ఇవ్వాల‌ని, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కార్మికుల‌ సంఖ్య పెంచాల‌ని అన్నారు.

సమాన పనికి సమాన వేతనం అమలు చేయాల‌ని లాక్‌డౌన్ కాలంలో పనిచేసిన వారికి ప్రభుత్వ హామీలో భాగంగా పది శాతం ఇన్సెంటివ్‌ ఇవ్వాల‌ని డిమాండ్‌ చేశారు. కరోనా పేషెంట్లు సిబ్బంది వాడి పారేసిన పిపిఈ కిట్లు ఇతర సామాగ్రిని ఆసుపత్రి ఆవరణ నుండి వెంటనే తీసివేయాల‌ని డిమాండ్‌ చేశారు. లేనియెడల‌ వారం రోజుల్లో సమ్మె నోటీస్‌ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌ కుమార్‌, మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు భాగ్యల‌క్ష్మి, కవిత, లింగం, ల‌క్ష్మీపతి, రఘు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article