కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం జనహిత భవన్లో ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 52 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 13, పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి 10, పింఛన్లు 3, తాగునీరు 4, రోడ్ల సమస్య గురించి 13, వ్యవసాయం సంబంధించి సమస్యలపై 10 చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఎవో శ్రీనివాస రావు ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. అటవీశాఖ అధికారి వసంత, మత్స్యశాఖ అధికారి పూర్ణిమ, జిల్లా పశువైద్యాధికారి జగన్నాథ చారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021