Breaking News

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో సోమవారం రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ గత నాలుగు నెల‌లుగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కరోనా వైరస్‌ కారణంగా రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. సంపత్‌ తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాల‌ని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

గత నాలుగు నెల‌ల కాలంలో కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ద్వారా 200 యూనిట్ల రక్తాన్ని ఆపదలో ఉన్న వారికి సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడామన్నారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌, రాజు, గడ్డం మహేష్‌ పాల్గొన్నారు.

Check Also

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు ...

Comment on the article