Breaking News

ఫూలే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

నిజామాబాద్‌, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా విశ్రాంత బ్యాంకు అధికారి బిట్ల రత్నయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేంద్ర కమిటీ చైర్మన్‌ సి.హెచ్‌.బాల‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల‌ చేశారు.

అధ్యక్షుడిగా రత్నయ్య, ఉపాధ్యక్షుడిగా రాసరి పెంటన్న, ప్రధాన కార్యదర్శిగా సి.హెచ్‌.సాయులు, సహాయ కార్యదర్శిగా ఉదయ కుమార్‌, కోశాధికారిగా ఆర్‌.నరసయ్య, కార్యవర్గ సభ్యులుగా బాస రాజేశ్వర్‌ను నియమించినట్లు వారు వివరించారు. భారతరత్న బి. ఆర్‌.అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావు పూలే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరిచేందుకు పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఏర్పాటుచేసినట్లు వారు తెలిపారు.

మహాత్మ పూలే, డా.అంబేద్కర్‌ భావజాలం పట్ల అవగాహన కలిగి ఉండి కుల‌రహిత సమాజ నిర్మాణం కాంక్షించే ఆశయం కల‌వారు పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌లో చేరాల్సిందిగా వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసేందుకు జిల్లావారిగా కమిటీ విస్తరణ చేపట్టామని వివరించారు. ఈ క్రమంలో నిజామాబాద్‌ జిల్లా కమిటీని ఎన్నుకున్నామన్నారు.

The following two tabs change content below.

Check Also

మొక్కలు చనిపోతే జరిమానా

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేంపల్లి మరియు నాగంపేట్‌ గ్రామాలలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ...

Comment on the article