రక్తదాత.. ప్రాణదాత…

కామారెడ్డి, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల‌ కేంద్రానికి చెందిన శిరీష (26) గర్భిణీ రక్తహీనతతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో బాధ పడడంతో వారు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి వ్యవసాయ విస్తరణాధికారి అశోక్‌ రెడ్డి సహకారంతో బి నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ బి నెగిటివ్‌ గ్రూపు రక్తం పదివేల‌ మందిలో 300 నుండి 400 మందికి మాత్రమే ఉంటుందని, గతంలో కూడా ఆపదలో ఉన్న మహిళల‌కు రక్తాన్ని అందించి ప్రాణాల‌ను కాపాడిన అశోక్‌ రెడ్డిని అభినందించారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాల‌ని కోరారు. కార్యక్రమంలో టెక్నిషియన్‌ చందన్‌ తదితరులు ఉన్నారు.

Check Also

26లోగా పూర్తి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 26 లోగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైన్‌ (సిఎంఆర్‌) ...

Comment on the article