Breaking News

ప్రభుత్వాలు అలా సూచించలేదు…

కామారెడ్డి, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ కార్యాల‌యంలో బుధవారం రాబోయే వినాయక ఉత్సవాల‌ గురించి ముఖ్య కార్యకర్తల‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్‌ సూచన మేరకు గత సంవత్సరం లాగానే ప్రతి యువజన సంఘం వాళ్ళు తక్కువ ఎత్తు గల‌ వినాయకుల‌ను ప్రతిష్టించి, భక్తి శ్రద్దల‌తో పూజలు నిర్వహించాల‌ని, శోభా యాత్ర లేని నిమజ్జనాలు చేసుకోవాల‌న్నారు. గణేష్‌ మండపాల‌ భక్తుల‌కు పోలిసు, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్తు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయ సహకారాలు అందించాల‌ని అన్నారు.

ఎక్కడైనా అధికారులు మండప నిర్వాహకుల‌కు కోవిడ్‌ను సాకుగా చూపి గణపతి విగ్రహాలు పెట్టొద్దని కానీ, ఎటువంటి ఇబ్బందికర పనులు చేసిన తమ దృష్టికి తీసుకు రావాల‌ని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా గణపతులు పెట్టొద్దని సూచించలేదని, నిబంధనల‌కు లోబడి కరోనా వ్యాప్తికి మనం కారకులం కాకుండా ఉత్సవాలు జరుపుకోవచ్చని స్పష్టం చేశారు.

Check Also

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు ...

Comment on the article