Breaking News

Daily Archives: August 13, 2020

ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సదాశివనగర్‌, గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. సదాశివనగర్‌ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పద్మాజివాడిలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులు పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. పద్మాజివాడి గ్రామ అవెన్యూ ప్లాంటేషన్‌ పనుల‌లో నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ సర్పంచ్‌, పంచాయతీ సెక్రెటరీల‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాల‌ని డి.పి.ఓ.ను ఆదేశించారు. భూంపల్లి ...

Read More »

ప్రారంభోత్సవానికి సిద్ధం

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం రైతు నగర్‌లో వంద శాతం పూర్తయిన రైతు వేదిక భవనాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సందర్శించారు. రైతు వేదిక భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భవన నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేసినందుకు సర్పంచ్‌ నాగేశ్వరరావు ను జిల్లా కలెక్టర్‌ అభినందించారు. పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. నాటిన మొక్కల‌ వివరాను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు బాన్సువాడ మండలం సోమేశ్వర్‌లోని రైతు వేదిక నిర్మాణం పనుల‌ను జిల్లా కలెక్టర్‌ ...

Read More »

కోవిడ్‌ గురించి విస్తృత ప్రచారం

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాల‌ని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు కామారెడ్డిలో వ్యాపార, వాణిజ్య సంస్థలు గత వారం నుంచి పూర్తి ...

Read More »

జిల్లాలో రెండు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లు

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌ను సంఘటితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలో భాగంగా ఏర్పాటు చేయనున్న ‘‘ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌’’ ను సరైన రీతిలో నడిపి రైతుల‌కు గిట్టుబాటు ధరలు ల‌భించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించే దిశగా ముందుకు తీసుకుని వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో నాబార్డ్‌, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ, బ్యాంకు అధికారుల‌తో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ ...

Read More »

మంచి భోజ‌నం అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌, పి హెచ్ సిల‌ ను సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. ఐసోలేషన్‌ సెంటర్‌ వద్ద అంబులెన్స్‌ ఎ్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, 108 అందుబాటులో లేకుంటే ప్రైవేటు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఐసోలేషన్‌ సెంటర్లో ...

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై గర్భిణికి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిసింహ వైద్యశాల‌లో తాడ్వాయి మండల‌ కేంద్రానికి చెందిన సునీత 28 సంవత్సరాల‌ వయసు కలిగిన గర్భిణీకి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణానికి చెందిన కిరణ్‌ సహకారంతో 39వ సారి ఓ నెగిటివ్‌ రక్తాన్ని వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో అందజేసి ప్రాణాల‌ను కాపాడారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రక్తదానం ...

Read More »