నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుంకుమార్చన పూజా కార్యక్రమంలో దిల్ రాజు దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం ఇందూరు తిరుమల క్షేత్రంలో శ్రావణ శుక్రవారం ఉదయం 10 గంటలకు మహాలక్ష్మి అమ్మవారికి నవ కలశ అభిషేకం చేశారు. అదేవిధంగా మహాలక్ష్మి వ్రతం సాయంకాలం 6:30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తామర కొలను వద్ద తామర పుష్పంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన, దీపారాధన గావించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ మెంబర్లు ...
Read More »Daily Archives: August 14, 2020
తేడాలుంటే సీజ్ చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అన్ని ఎరువుల షాపులపై రెవిన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఒకేసారి మూకుమ్మడి దాడులు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఎరువుల షాపు పంపిణీ జరిగినది, రైతులకు పంపిణీ చేసిన మిగులు వివరాలను తనిఖీ చేయాలని, స్టాక్ రిజిష్టర్‌కు ఫిజికల్ స్టాక్ తేడా వుంటే వెంటనే షాప్ సీజ్ చేయాలని, లైసెన్సు రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఎక్కువ ఎరువులు తీసుకున్న ...
Read More »వరి, సోయా పంటల పరిశీలన
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా, బర్థిపూర్ మండలం, మినార్పల్లి గ్రామంలోని వరి, సోయాబీన్ పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం బర్థిపూర్లో పంటలు పరిశీలించిన అనంతరం మాట్లాడారు. వరిలో బ్యాక్టీరియా, ఎండు ఆకు తెగులు, సోయాబీన్లో పొగాకు లద్దేపురుగు, ఎల్లో మొజాయిక్ వైరస్ సోకినట్లు పరిశీలించడం జరిగిందని, రైతులు వరిలో వాతావరణం పొడిగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా తెగులు కొరకు ఆగ్రోమిసైన్ 80 గ్రాము పిచికారీ ...
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్మల గ్రామానికి చెందిన నరేందర్ అనే క్యాన్సర్ బాధితుడు అఖిల హాస్పిటల్లో ఆపరేషన్ నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో బి పాజిటివ్ రక్తం అవసరమైంది. కాగా టీజీవిపి నాయకులను సంప్రదించగా సీనియర్ నాయకులు బొనగిరి శివ కుమార్ స్పందించి కామారెడ్డికి చెందిన బాలరాజు అనే యువకుని ద్వారా రక్తదానం చేయించారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన బాలరాజుకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో రాజు, వీటి ఠాగూర్ ...
Read More »5 కరోన కేసులు నిర్ధారణ
నిజాంసాగర్, ఆగస్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాపిడ్ టెస్ట్ చేయగా అవుసుల తండా చెందిన ఐదుగురికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్య అధికారి రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్ మండలంలో మొత్తం కరోన కేసులు 31 కాగా వీరిలో కోలుకున్న వారు ముగ్గురు అని తెలిపారు.
Read More »నిజామాబాద్‌లో కోవిడ్ టెస్టింగ్ వ్యాన్
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్టింగ్ మొబైల్ వ్యాన్‌ను జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి కోవిడ్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించేలా ఏర్పాటు చేసిన కోవిడ్ టెస్టింగ్ మొబైల్ వ్యాన్‌ను కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నగరంలో అధిక జనాభా ఉన్నందున కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నవని, ప్రజలు భయపడి టెస్ట్‌ు ...
Read More »యూరియా కొరత లేకుండా చూడాలి
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ ధపెదర్ రాజు అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రైతు వేదికల వద్ద ఏడిఏ ఆంజనేయులతో మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. అచ్చంపేట గ్రామంలో జరుగుతున్న రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించారు. రైతు వేదికలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ...
Read More »ఎప్పటికప్పుడు పేమెంట్ చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారంలో భాగంగా మండలంలోని ప్రతి రోడ్డులో ఇరువైపులా ఐదు మీటర్లకు ఒకటి చొప్పున మొక్కలను నాటాలని, క్రిమటోరియంను మోడల్ క్రిమటోరియంగా తీర్చిదిద్దాలని, ప్రతి మొక్కకు, క్రిమటోరియంకు వాచ్ అండ్ వార్డ్ నియమించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎంపిడివోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రెటరీలు, టెక్నికల్ అసిస్టెంట్లతో నిర్వహించిన సెల్ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇచ్చిన ప్రతి సూచనలు పాటించాలని, రూల్స్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం ఒక పద్ధతి ...
Read More »ఆలయ నిర్మాణానికి మంత్రి భూమిపూజ
ఆర్మూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా, ముప్కల్ మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీ సమేతంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి 34 లక్షల రూపాయల నిధులు మంజూరు కాగా, ఆలయ నిర్మాణం కోసం శుక్రవారం మంత్రి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమ పద్మ, జెడ్పిటిసి బద్దం నర్సవ్వ, సర్పంచ్ కొమ్ముల ...
Read More »సాహిత్య పరిశోధకులు చాట్లనర్సయ్య మృతి
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ సాహిత్య పరిశోధకులు, విశ్రాంత అధ్యాపకులు డా.చాట్ల నర్సయ్య గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, పలువురు సాహితీ వేత్తలు, పరిశోధకులు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డా.చాట్ల నర్సయ్య తెలుగు పండితులుగా, జూనియర్ లెక్చరర్‌గా, డిగ్రీ అధ్యాపకులుగా సుదీర్ఘ కాలం విద్యా సేవ చేసి ఎంతో మంది విద్యార్థుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. ఉద్యోగ విరమణ ఆనంతరరం కామారెడ్డిలో ...
Read More »