Breaking News

కుంకుమార్చనలో దిల్‌రాజు దంపతులు

నిజామాబాద్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుంకుమార్చన పూజా కార్యక్రమంలో దిల్‌ రాజు దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం ఇందూరు తిరుమల‌ క్షేత్రంలో శ్రావణ శుక్రవారం ఉదయం 10 గంటల‌కు మహాల‌క్ష్మి అమ్మవారికి నవ కల‌శ అభిషేకం చేశారు.

అదేవిధంగా మహాల‌క్ష్మి వ్రతం సాయంకాలం 6:30 గంటల‌కు ఆల‌య ప్రాంగణంలోని తామర కొల‌ను వద్ద తామర పుష్పంలో వేంచేసి ఉన్న శ్రీ మహాల‌క్ష్మి అమ్మవారికి కుంకుమార్చన, దీపారాధన గావించారు. పూజా కార్యక్రమంలో ఆల‌య ధర్మకర్తలు నర్సింహారెడ్డి దంపతులు, ఆల‌య ట్రస్ట్‌ మెంబర్లు నర్సారెడ్డి, రవి, నరాల‌ సుధాకర్‌, ప్రసాద్‌, రంగారెడ్డి, నర్సింగ్‌పల్లి మహిళలు పాల్గొన్నారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article