Breaking News

నిజామాబాద్‌లో కోవిడ్‌ టెస్టింగ్‌ వ్యాన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసిన కోవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ వ్యాన్‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ప్రారంభించారు. శుక్రవారం నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి కోవిడ్ ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించేలా ఏర్పాటు చేసిన కోవిడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ వ్యాన్‌ను కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ నగరంలో అధిక జనాభా ఉన్నందున కోవిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నవని, ప్రజలు భయపడి టెస్ట్‌ు జిల్లా ఆసుపత్రి వరకు వచ్చి చేసుకోవడం లేదని, మొబైల్‌ టెస్టింగ్‌ వాన్‌లో వైద్య సిబ్బందిని, రాపిడ్‌ ఆంటీజన్‌ కిట్లు, సామాగ్రి ఏర్పాటు చేయడం జరిగిందని, వీరు పట్టణంలోని అన్ని ప్రాంతాల‌లో తిరిగి ల‌క్షణాలున్న వారు, తొమ్మిది నెలల‌ గర్భవతులు, 55 సంవత్సరాలు పైబడిన ప్రైమరీ కాంటాక్టు (కోవిడ్‌ పేషెంటుతో కాంటాక్ట్‌ అయ్యి 8 రోజులు దాటిన వారు) ల‌కు వారు నివసించే ప్రాంతాల‌లోనే టెస్టులు చేస్తారని తెలిపారు.

వాన్‌ తిరిగే ప్రాంతాల‌లో ఆశా వర్కర్లు ఆయా ప్రాంతాల్లో టెస్ట్‌ చేయవల‌సిన వారిని గుర్తించి వారికి, వైద్యాధికారుల‌కు సమాచారం అందించాల‌ని, వారికి వ్యాన్‌లోనే రాపిడ్‌ టెస్ట్‌ు నిర్వహించి, పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే ఐసోలేషన్‌ కీట్స్‌, అవసరమైన సూచనలు ఇచ్చి ఐసోలేషన్‌కు పంపించాల‌న్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్కులు దరిస్తూ, భౌతిక దూరం పాటించాల‌ని, ఎప్పటికప్పుడు సబ్బుతో లేదా సానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకొంటూ జాగ్రత్తగా ఉండాల‌ని‌ జిల్లా కలెక్టర్‌ ప్రజల‌ను కోరారు. కార్యక్రమంలో నగర మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, మొబైల్‌ వాన్‌ ఇంచార్జి వైద్యాధికారిణి డాక్టర్‌ అంజన తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article