కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కట్టడికి పకడ్బందీగా సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కలెక్టరేట్ జనహితలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఆశ, ఆరోగ్య సిబ్బంది కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలపై సర్వే చేపడుతున్నారని తెలిపారు. జ్వరం, దగ్గు, దమ్ము ఉంటే రాపిడ్ టెస్టులు చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్ ఉన్న వారికి గృహ నిర్బంధంలో ఉంచి కిట్టు అందజేయాలని పేర్కొన్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాలని ...
Read More »Daily Archives: August 15, 2020
సిఎం సహాయనిధి చెక్కుల అందజేత
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు చేయించారు. డిచ్పల్లి గ్రామానికి చెందిన మధుకి 56 వేల చెక్కును సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్‌కి అందజేశారు. మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన స్వరూపకి శాసనసభ్యులు 60 వేల రూపాయలను శనివారం ...
Read More »భక్తి శ్రద్దలతో పాదయాత్ర
నిజాంసాగర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో గల 161 జాతీయ రహదారి ప్రక్కన అంజనాద్రి ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారం నిర్వహించే అంజనాద్రి పాదయాత్ర బ్రహ్మణపల్లి గ్రామం నుండి మొదలైంది. పాదయాత్ర బ్రహ్మణపల్లి, అంజనాద్రి మందిరం, మాసన్ పల్లి, ఆరేపల్లి మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సిద్ది వినాయక మందిరానికి చేరుకుంది. భక్తుల భజన భక్తి పాటలతో అంజనాద్రి పాదయాత్ర మారుమోగింది. గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అవాంతరాలు ...
Read More »ఈ – ఆఫీస్ పోర్టల్ ప్రారంభం
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం 74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో ఈ- ఆఫీస్ పోర్టల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా కాలెక్టర్ శరత్, జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ యాది రెడ్డి, లోకల్ బాడీస్ ...
Read More »అధికారులందరు అలర్ట్‌గా ఉండాలి
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయని, దీని వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఆదుకునేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేస్తుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ప్రజలకు వర్షాల వల్ల ఎటువంటి అసౌకర్యం కలిగినా కంట్రోల్ రూమ్‌కు 08462 220183 నెంబర్ పై ఫోను ద్వారా కానీ, ఈ-మెయిల్ ద్వారా ...
Read More »ప్రభుత్వ పథకాల ఫలాలు అందరికి అందాలి
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో 15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సి పి కార్తికేయతో కలిసి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ...
Read More »బాధిత కుటుంబాలకు పరామర్శ
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామానికి చెందిన కొత్తూరి రాజశేఖర్ (15) అనే అబ్బాయి గత మూడు రోజుల క్రితం కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించి, తల్లి తండ్రికి దైర్యం చెప్పి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం మార్కళ్ గ్రామానికి చెందిన చాకలి భైరయ్య ప్రమాదవశాత్తు గల్ప్‌లో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మండల ...
Read More »పోరాటానికి కలిసి రావాలి
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంసిపిఐ(యు), ఏఐసిటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కార్యాలయం ముందు జాతీయ జెండా ఆవిష్కరించి, రాజ్యాంగ హక్కుల రక్షణకు ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సన్నధ్దం కావాలని పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగంను దేశంలో ఉన్న పాలకులు ఖూనీ చేస్తూ స్వతంత్ర వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ ...
Read More »నగర ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచమంతా కరోన వైరస్ వ్యాధి వల్ల విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటుందన్నారు. తనకు పాజిటివ్ రావడంతో భగవంతుని దయ, నాయకులు, కార్యకర్తల, శ్రేయోభిలాషుల ప్రేమ అభిమానులతో మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఆరోగ్యంగా వచ్చానని పేర్కొన్నారు. నిజామాబాద్ నగర ప్రజలకు తాను జీవితాంతం ...
Read More »ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బీర్కూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్, నసురుల్లా బాద్ మండలాల్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయా మండలాల్లో తహసీల్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్, ఐకెపి, వెటర్నరి, పిహెచ్సి, పాఠశాలల వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీర్కూర్ గ్రామ సచివాయంలో సర్పంచ్ అవారి స్వప్న, బీర్కూర్ గ్రామంలోని పోచారం కాలనీలో నల్ల నవీన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Read More »తెరాస కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బాన్సువాడ, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా బాన్సువాడ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగుర వేసి వందనం చేశారు. భారత దేశానికి స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసి వారికి ఘన నివాళులు అర్పించారు. జిల్లా రైతు బంధు అధ్యక్షుడు ...
Read More »