Breaking News

తెరాస కార్యాల‌యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బాన్సువాడ, ఆగష్టు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా బాన్సువాడ టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల‌యంలో, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగుర వేసి వందనం చేశారు.

భారత దేశానికి స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఎందరో మహానుభావుల‌ త్యాగాల‌ను ఈ సందర్భంగా గుర్తుచేసి వారికి ఘన నివాళులు అర్పించారు.

జిల్లా రైతు బంధు అధ్యక్షుడు దుద్దుల‌ అంజిరెడ్డి, బాన్సువాడ మండల‌ ఎంపిపి దొడ్ల నీరజ వెంకటరామ్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు పాత బాల‌కృష్ణ, పిఏసిఎస్‌ చైర్మన్‌ కృష్ణరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, ఎజాజ్‌, గురువినయ్‌, బాబా, దాసరి శ్రీనివాస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article