నిజాంసాగర్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో గల 161 జాతీయ రహదారి ప్రక్కన అంజనాద్రి ఆలయంలో శ్రావణ మాసం చివరి శనివారం నిర్వహించే అంజనాద్రి పాదయాత్ర బ్రహ్మణపల్లి గ్రామం నుండి మొదలైంది. పాదయాత్ర బ్రహ్మణపల్లి, అంజనాద్రి మందిరం, మాసన్ పల్లి, ఆరేపల్లి మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న సిద్ది వినాయక మందిరానికి చేరుకుంది.
భక్తుల భజన భక్తి పాటలతో అంజనాద్రి పాదయాత్ర మారుమోగింది. గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అవాంతరాలు లేకుండా పాదయాత్ర చేయడం సంతోషంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. సుమారు 150 మంది భక్తులు యాత్రలో స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేశారు. వీరికి మనకోసం మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు కిషోర్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు పెద్ద అజేయ్ పటేల్, రాజు పటేల్ అల్పాహారాన్ని అందజేశారు.
కార్యక్రమంలో నాయకులు మాజీ సీడీసీ చైర్మన్ దుర్గరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షు రమేష్ గౌడ్, నర్సింగ్ రావు పల్లి సర్పంచ్ సాయిలు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ ఎర్రో బాలయ్య, ఉప సర్పంచ్ గారబోయిన వెంకటేశం, నాయకులు యటకరి నారాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021