Breaking News

రెండు ల‌క్షల‌ ఇళ్లలో సర్వే

కామారెడ్డి, ఆగష్టు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అన్ని రకాల‌ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో మంగళవారం జరిగిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెండు ల‌క్షల‌ ఇండ్లను సర్వే చేపట్టి వ్యాధులు ఉన్న వారిని గుర్తించామని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల‌ పరిధిలో 400 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా, సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కరోనాను ముందస్తుగా గుర్తిస్తే మందుతో అరికట్టవచ్చని సూచించారు. మలేరియా, డెంగ్యూ వంటి ల‌క్షణాలున్న వారిని గుర్తించి మందులు అందజేస్తామని చెప్పారు.

జ్వరం, దగ్గు, దమ్ము, ఇతర వ్యాధులున్న వైద్య శిబిరాల‌ ద్వారా గుర్తిస్తున్నామని తెలిపారు. పోలీస్‌, రెవిన్యూ, ఆరోగ్య శాఖ సమన్వయంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ శోభారాణి, వైద్యులు పాల్గొన్నారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article