Breaking News

అశ్రద్ద చేయకూడదు

కామారెడ్డి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాల‌ని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు.

కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాల‌ని తన కుటుంబ సభ్యులందరు జాగ్రత్తలు తీసుకోవాల‌ని, మాస్క్‌ ధరించాల‌ని, భౌతిక దూరం పాటించాల‌ని, జనం గుంపులుగా చేరకూడదని, తరుచుగా చేతులు శుభ్రపరచుకోవాల‌ని సూచించారు. పిల్ల‌లు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్థులు వీధుల్లోకి రాకుండా ఉండాల‌ని పేర్కొన్నారు. పౌష్టికాహారం, శుభ్రమైన నీరు, పరిసరాల‌ పరిశుభ్రత పాటిస్తే అంటువ్యాధులు సోకవని తెలిపారు.

ప్రచారంలో వి.సంజీవరెడ్డి, రాణి, జిల్లా ఆరోగ్య బోధకులు, కామారెడ్డిలో అశోక్‌ నగర్‌, విద్యానగర్‌, కల్కినగర్‌, బస్టాండ్లలో, మున్సిపల్‌ రోడ్‌, నిజాంసాగర్‌ రోడ్‌, స్టేషన్‌ రోడ్‌, సిరిస్లిరోడ్డు, మార్కెట్‌, పెద్దమ్మ గల్లీ, వివేకానంద కాల‌నీ, అంబెడ్కర్ కాల‌ని, పెద్దబజార్‌, హన్మాన్‌రోడ్డు, ఇస్లాంపూర్‌, సుభాష్‌ రోడ్డులో ప్రచారం చేసారు.

Check Also

బతుకమ్మ చీరల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17 వ వార్డ్‌లో శుక్రవారం బతుకమ్మ ...

Comment on the article