కామారెడ్డి, ఆగష్టు 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, కరోనాను అడ్డుపెట్టుకొని హిందూ పండుగలపై ఆంక్షలు పెట్టడం తగదని న్యాయవాది సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమతం వారికైనా వారి వారి పండగలను స్వేచ్చగా జరుపుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, హక్కులను కాలరాయడానికి ఎటువంటివారికైనా అధికారాలు లేవని స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. అయితే కొన్ని గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామ పంచాయతీలు, కాలనీ పెద్దలు ఒకే గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, మరికొన్ని చోట్ల గణేశ్ ఉత్సవాలను నిషేదించాలని తీర్మానిస్తూ లెటర్ ప్యాడ్లపై లేఖలు విడుదల చేశారన్నారు. ఇటువంటి తీర్మానాలు చట్ట వ్యతిరేకమే గాకుండా శిక్షార్హం కూడా అని న్యాయవాది సురేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
కోవిడ్ నిబంధనలకు లోబడి ఎటువంటి ఉత్సవాలనైనా జరుపుకోవచ్చని, అటువంటి ఏ ఉత్సవాలపైన కూడా గ్రామాభివృద్ది కమిటీలు, గ్రామ పంచాయతీలు, గ్రామ పెద్దలు నిషేదించడానికి, అడ్డుకోవడానికి వీలులేదని, అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని న్యాయవాది తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని చోట్ల పోలీసులు కూడా కరపత్రాలు విడుద చేసినట్టు గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు విధించినట్టు వార్తలొచ్చాయి. వాస్తవాలు, అవాస్తవాలు తెలుసుకోవడానికి అవకాశం లేదుకానీ, పోలీసులకు, గ్రామాభివృద్ధి కమిటీలకు ఆంక్షలు విధించడానికి చట్టపరమైన అధికారాలు లేవని పేర్కొన్నారు.
ఎవరైనా గణేశ్ ఉత్సవాలు జరుపుకుంటే వాటిని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. అన్ని గణేశ్ ఉత్సవ కమిటీలకు సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయా గణేశ్ మండలీల వారు ప్రతి సంవత్సరం లాగే యధావిధిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు స్వేచ్చగా నిర్వహించుకోవచ్చన్నారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. కొందరు చేసే తీర్మానాలు హాస్యాస్పందంగా ఉన్నాయని, గ్రామాల్లో వైన్సులు తెరిచినప్పుడులేని జాగ్రత్తలు, ఆంక్షలు హిందూ పండుగలు, ఉత్సవాలకు ఎందుకని ప్రశ్నించారు.
ఇటువంటి చర్యలు మత స్వేచ్చను హరించినట్టవుతుందని, మత స్వేచ్చను ఎవరు హరించినా రాజ్యాంగ పరంగా అది నేరమని అన్నారు. ఏ గణేశ్ మండపాల వద్దనైనా ఉత్సవాలను ఎవరైనా అడ్డుకున్నట్టు తెలిస్తే తనకు సమాచారం అందించాలని తగిన న్యాయ సహాయం, సలహాలు, సూచనలు అందజేస్తానని న్యాయవాది సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. సంప్రదించవలసిన నెంబర్ 929 999 0952
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం సహకరించాలని, ఎలాంటి ఇబ్బందులు పెట్టరాదని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు భక్తులను బెదిరించరాదని, మంటపాల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలకు లోబడి మాస్కులు ధరించాలన్నారు. సామూహికంగా కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు.
గణేష్ మంటపాలు గణేష్ విగ్రహాల ఎత్తు భక్తులకు సంబందించిన విషయంలో పోలీస్ అధికారులు అధిక జోక్యం చేయకూడదన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021