కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మా దివ్యాంగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి మరియు ఆవుపేడతో గణపతులు తయారుచేశారు. ప్రస్తుతం కరోనాతో పోరాటం చేస్తూనే, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించానే సంకల్పంతో ఆవుపేడతో గణపతులు తయారుచేశారు. మేడ్చల్‌లో కృష్ణ గోశాల వారి సహకారంతో మట్టి గణపతులు తయారుచేశారు. కరోనా సోకకుండా జాగ్త్రతలు తీసుకుంటూ వికలాంగులు అధైర్యపడకుండా సీజనల్‌గా ఉపాధిని ఎంచుకుని బతకాలనే ఆలోచనతో ఉపాధి పొందుతున్నారు.
Read More »Daily Archives: August 21, 2020
పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుస్తాం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలను గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో శుక్రవారం ఆయన పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మియావాకి విధానంలో మొక్కలను దగ్గర దగ్గరగా నాటి చిట్టడివి వాతావరణం కల్పించాలని సూచించారు. నాటిన మొక్కలకు క్రమ సంఖ్య కేటాయించడంపై సర్పంచి రవి తేజ గౌడ్‌ను అభినందించారు. భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో కంపోస్ట్ షెడ్డు సందర్శించారు. ...
Read More »లక్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్టులు
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కోవిడ్ టెస్టులు 127 సెంటర్లలో నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ 2500 పైచిలుకు టెస్ట్‌లు చేయాలన్న నిర్ణయంతో ముందుకు వెళుతున్నామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పిపిరి గ్రామములో కోవిడ్ టెస్టింగ్ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎవ్వరూ భయపడవద్దని, లక్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టు చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారికి, హైరిస్క్ జోన్లో ఉన్న వారికి, గర్బవతులకు ఎక్కువగా బయట తిరుగుతూ పనులు చేసుకునే మున్సిపల్ సిబ్బంది, ...
Read More »టెస్టులు నిర్వహించేవారు ఎన్ 95 మాస్కు ధరించాలి
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ మరియు రైతు వేదికలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పర్యవేక్షించడం జరిగిందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్లు చాలా వరకు లక్ష్యం చేరుకున్నారని కొన్ని పిహెచ్సిలో ఏఎన్ఎంలు లక్ష్యం చేరుకోలేకపోయారని అట్టి వారికి సంబంధిత మెడికల్ ఆఫీసర్లు ధైర్యం చెప్పాలని, మెడికల్ ఆఫీసర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాట్లు బాగా చేశారని, టెస్ట్‌లు చేసే ...
Read More »ఆరాధనా స్థలాలు పునర్ నిర్మాణం చేయాలి
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కలెక్టర్ ద్వారా రాష్ట్ర గవర్నర్‌కి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశానుసారం కార్యక్రమం నిర్వహించినట్టు డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పట్టణ అధ్యక్షుదు పండ్ల రాజు, ...
Read More »వినాయక చవితి శుభాకాంక్షలు
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ప్రజలకు వినాయక చవితి సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వీలైనంత వరకు చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడేలా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ...
Read More »కోవిడ్ జర్నలిస్టులకు కోటి సాయం
హైదరాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమిలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం తెలంగాణ జర్నలిస్టుల కు రక్షణ కవచంలా తయారయ్యింది. వంద కోట్ల నిధుల నుండి 34.50 కోట్ల రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి జమ అయ్యాయి. నిధి ద్వారా వచ్చిన వడ్డీతో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఒక కోటి 4 లక్షల 40 ...
Read More »