Breaking News

127 సెంటర్లలో టెస్టులు

నిజామాబాద్‌, ఆగష్టు 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ టెస్టులు ఈనెల‌ 21వ తేదీ నుండి 127 సెంటర్లలో ప్రతిరోజూ 2500 పైచిలుకు టెస్ట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వినాయక్‌ నగర్‌ మరియు అర్సపల్లిలోని యూపిహెచ్‌సి కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

ఎవ్వరూ భయపడ వద్దని, ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్నవారికి, హైరిస్క్‌ జోన్లో ఉన్న వారికి, గర్భవతుల‌కు ఎక్కువగా బయట తిరుగుతూ పనులు చేసుకునే మున్సిపల్‌ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు వంటి వారికి కూడా టెస్టులు చేస్తున్నామని, టెస్ట్‌ చేసి పోసిటివ్‌ వచ్చిన వారికి అక్కడే కౌన్సెలింగ్‌ నిర్వహించి ఐసోలేషన్‌ కిట్టు ఇచ్చి హోం ఐసోలేషన్‌కు పంపుతున్నారని, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఫోన్‌ చేసి పర్యవేక్షిస్తారని, జిల్లాలో మూడు ప్రభుత్వ ఐసోలేషన్‌ సెంటర్లు నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌లో వున్నవని, వీటితో పాటు 7 ప్రైవేట్‌ హాస్పిటల్‌కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి మెడికల్‌ ఆఫీసర్లు సల‌హాలు ఇవ్వాల‌ని, కోవిడ్ ల‌క్షణాలు లేని వారు భయపడవల‌సిన పని లేదని, మైల్డ్‌ సింప్టమ్స్‌ ఉన్న వారు కూడా టాబ్లెట్‌ వాడితే తగ్గి పోతుందని, జిల్లా ఆసుపత్రిలో 272 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశామని, ఐసీయూలో 60 బెడ్స్‌ ఉన్నాయని, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో వాడే మెడిసిన్స్‌ మన దగ్గర వున్నాయని, చికిత్సకు అవసరమైన అన్ని రకముల‌ మెడిసిన్స్‌ వున్నాయని, ప్రజలు భయపడాల్సిన పని లేదని, ఎక్కడికి వెళ్లినా మాస్కు ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల‌ని, రోగ నిరోధక శక్తి పెంచుకోవాల‌ని, యోగ చేయడము, సి, డీ విటమిన్లు తీసుకోవాల‌ని, వేడి నీరు తాగాల‌ని, వాకింగ్‌ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సూచించారు.

సిటీ స్కాన్‌ ద్వారా కోవిడ్‌ నిర్ధారణ కాదని, అక్కడక్కడ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో సిటీ స్కాన్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అట్టి హాస్పిటల్‌ పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యటనలో జిల్లా కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమీషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిప్యూటీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article