బీర్కూర్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో మంగళవారం బీర్కూర్‌లో 50 రాపిడ్ టెస్టులు నిర్వహించినట్టు వైద్యాధికారి డాక్టర్ రవిరాజ్ తెలిపారు. కాగా పరీక్షలు నిర్వహించిన వారిలో 15 మందికి పాజిటివ్, 25 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు పేర్కొన్నారు. బరంగెడ్గి 8, మిర్జాపూర్ 2, సంగెం 2, సంబాపూర్ 1, చించోలి 1, బీర్కూర్ 1 పాజిటివ్ వచ్చిన వారు అని తెలిపారు.
Read More »Daily Archives: August 25, 2020
తెలంగాణ ఆత్మగౌరవ పతాక సురవరం
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ కవులు రచయితల ఆత్మగౌరవానికి సురవరం ప్రతాపరెడ్డి నిలువెత్తు జెండా లాంటివాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా నగరంలోని ట్రెండి క్రియేషన్స్‌లో నిర్వహించిన సుమాంజలి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సురవరం సారథ్యంలో వచ్చిన గోలకొండ కవుల సంచిక తెలంగాణలో కవులు, సాహిత్యము లేదన్న దురహంకారులకు పదునైన సమాధానంగా నిలిచిందని పేర్కొన్నారు. సురవరం రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలుగు ...
Read More »ఆదర్శం రక్తదాత లావణ్య
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ దాస్ వైద్యశాలలో రాఘవపూర్ గ్రామానికి చెందిన లాస్య (24) అనే మహిళకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బిబీపేట గ్రామానికి చెందిన లావణ్య ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు. కరోనా కాలంలో రక్తదానం చేయడానికి 30 కిలోమీటర్ల దూరం బిబిపేట్ నుండి లావణ్య ముందుకు రావడం ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయమన్నారు. ప్రస్తుత సమయంలో పక్కింటి వాళ్ళ ...
Read More »