Breaking News

అక్కడ అన్ని సౌకర్యాలున్నాయి….

నిజామాబాద్‌, ఆగష్టు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి. బుధవారం రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆదేశాల‌ మేరకు జిల్లా కలెక్టర్‌ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆలంబన వృద్ధాశ్రమంలో పాజిటివ్‌ వచ్చిన రోగుల‌ను పరామర్శించారు.

వారి కుటుంబ సభ్యుల‌తో మాట్లాడి, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, నిజామాబాద్‌కు గాని, ప్రైవేట్‌ హాస్పిటల్‌ గాని, ఇంటివద్ద సౌకర్యాలు ఉన్నవారిని వారి వారి ఇళ్లకు గాని డాక్టర్ సల‌హా మేరకు పంపాల‌ని, రిస్క్‌ ఉన్న పేషెంట్లను హాస్పిటల్‌కు పంపాల‌న్నారు. అందుకోసం 108 అంబులెన్స్‌ గాని ప్రైవేటు అంబులెన్సు కానీ మూడిరటిని అందుబాటులో ఉంచుకోవాల‌ని జిల్లా హాస్పిటల్‌ డిప్యూటీ డిఎం హెచ్‌వోను ఆదేశించారు. వృద్ధాశ్రమంలో మొత్తం 64 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా 26 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించామని, సొసైటీ ద్వారా వారి కుటుంబ సభ్యుల‌కు తెలియ చేయాల‌ని, వాళ్ళ అభిప్రాయం మేరకు ప్రోటోకాల్‌ ప్రకారం ఎక్కడ ఉంచాల‌న్నది డాక్టర్ సల‌హా మేరకు తీసుకోవాల‌న్నారు.

ల‌క్షణాలు లేకుండా పాజిటివ్‌ ఉన్న పేషెంట్స్‌ను అవసరం మేరకు మాక్లూర్‌ ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపవచ్చని, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఐదు రోజుల‌ తర్వాత మిగిలిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏర్పాట్లు కల్పించినందుకు ఆర్‌.బి.వి.ఆర్‌.ఆర్‌ సొసైటీ వారు మంత్రికి, కలెక్టర్‌కి ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్‌ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అంజన, డాక్టర్‌ నవీన్‌ కుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article