Breaking News

భూముల రక్షణకు నిరసన దీక్షలు

కామారెడ్డి, ఆగష్టు 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాదిగ దండోరా జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎస్సీ ఎస్టీ భూముల‌ రక్షణ కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు బాగయ్య అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షురాలు ల‌క్ష్మి పెంటయ్య, లింగం, కిరణ్‌ తదితరులు కూర్చున్నారు. దీక్షకు సిపిఐ జిల్లా కార్యదర్శి దశరథ్‌, సహాయ కార్యదర్శి పి.బాల‌రాజు, ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, రాష్ట్ర నాయకుడు హాజరై మాట్లాడారు.

ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ భూముల‌ను స్మశాన వాటికలు డంపింగ్‌ యార్డ్‌ు, గ్రామీణ పార్కుల‌ పేరుతో అక్రమంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు కరోనా మహమ్మారితో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆసుపత్రులు నిర్మించకుండా దళితుల‌ భూముల‌ను అన్యాక్రాంతం చేసి స్మశాన వాటికలు కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు మేనిఫెస్టోలో దళితుల‌కు 3 ఎకరాల‌ భూమి ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిందని అలాంటి ప్రభుత్వం దళితుల‌కు చెందిన భూముల‌ను లాక్కొనే చర్యలు వెంటనే మానుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. మరోవైపు రైతు వేదికల‌ పేరుతో గ్రామాల్లో కొండలు చెరువులు అన్యాక్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కుట్రలు మానుకోవాల‌ని డిమాండ్‌ చేశారు.

లేనిపక్షంలో మద్దికాయల‌ ఓంకార్‌ స్థాపించిన మహాజన అధ్యక్షుడైన మంద కృష్ణ మాదిగతో కలిసి మిగతా వామపక్షాలు కలుపుకొని బహుజన సంఘాల‌ను కలుపుకొని బహుజన సంఘాల‌ హక్కుల‌ రక్షణ కోసం పోరాటాలు తీవ్రతరం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article