నిజామాబాద్, ఆగష్టు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం, తాడెం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. శుక్రవారం జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా తాడెం గ్రామంలో విలేజ్ పార్కు స్థలం, నిర్మాణంలో ఉన్న రైతు వేదికలు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి విలేజ్ పార్క్ ఎంతో ముఖ్యమని, విలేజ్ పార్క్ స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇరిగేషన్ ల్యాండ్ గ్రామపంచాయతీ కంట్రోల్లో ఉంటుందన్నారు. పార్కు వెలుపల ఉపాధి కోసం గ్రామ పంచాయితీ నుండి ఈత చెట్లు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఈత చెట్లకు వాచ్ అండ్ వార్డ్కు వ్యక్తిని నియమించి చెట్లకు వాటర్ పోయించాలన్నారు. ఈత చెట్లు పెరిగిన తర్వాత కల్లు గౌడ కులస్తులే తీయొచ్చునని, వారికి ఉపాధి కలుగుతుందన్నారు.
పార్కులో నీటుగా మొక్కలు నాటాలని, ఇరిగేషన్ ల్యాండ్ ఖాళీ స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూమికి సంబంధించి గ్రామపంచాయతీలో తీర్మానం చేసుకుని వెంటనే లెవెల్ చేయించాలని ఆదేశించారు. విలేజ్ పార్క్ ఒక ఎకరా ఉండాలని, ఐదు రోజుల్లో తిరిగి ఆకస్మిక తనిఖీ చేస్తానని అప్పటికి ల్యాండ్ లెవెల్ చేసి, హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్, సర్పంచ్ లత, ఎంపీడీవో మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021