నిజామాబాద్, ఆగష్టు 29 ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ అధికారాలు రెడీ అవుతున్నకొత్త రెవెన్యూ కోడ్ నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ కోడ్‌తో భూ లావాదేవీల స్వరూపమే మారబోతున్నది. డివిజన్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే రిజిస్ట్రేషన్లు ఇక మండల స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారాలను తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తహసీల్దార్లను మండల్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఎంఎల్‌ఏఓ)గా వ్యవహరించేలా చట్టంలో మార్పు చేయబోతున్నట్లు సమాచారం. ...
Read More »Daily Archives: August 29, 2020
బీర్కూర్, నసురుల్లాబాద్‌లో 20 పాజిటివ్
బీర్కూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలకు సంబంధించిన కోవిడ్ టెస్టులను బీర్కూర్ పిహెచ్సిలో శనివారం నిర్వహించారు. మొత్తం 69 టెస్టులకు గాను 20 మందికి పాజిటివ్, 49 మందికి నెగిటివ్ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్ రవిరాజ్ తెలిపారు.
Read More »కుంటలో చేప పిల్లల విడుదల
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మంగళూరు గ్రామ శివారులో గల కొత్త కుంటలో సర్పంచ్ గైని స్వప్న రమేష్, ఉప సర్పంచ్ దత్తు కలిసి చేపపిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం 100 శాతం సబ్సిడీ కింద చేపపిల్లలను ఇవ్వడం జరుగుతుందన్నారు. మత్స్య కార్మికుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుపేద కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవడం ...
Read More »గ్రామాభివృద్ధే నా లక్ష్యం
నిజాంసాగర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని మంగళూరు గ్రామ సర్పంచ్ స్వప్న రమేష్ అన్నారు. నిజాంసాగర్ మండలం మంగళూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌తో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించారు. గ్రామంలో మురికి కాలువలు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్, పిచికారి చేయడం జరుగుతుందన్నారు. త్వరలో పల్లె ప్రకృతి వనం కూడా పూర్తి దశకు చేరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ...
Read More »రెండు కళాశాలలను ప్రారంభించాలి
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజూరైన పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కి బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విఠల్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కామారెడ్డి 6 జిల్లాలకు కేంద్రంగా ఉందని, ఇక్కడ టెక్నికల్ విద్యాసంస్థలు లేకపోవడం వల్ల ఇతర ...
Read More »వంద శాతం హాజరయ్యేలా చూడాలి
కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీవీలు లేని పేద విద్యార్థులను గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠాలు వినే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే ఆన్లైన్ పాఠ్యాంశాలు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ తరగతుల సమయంలో ...
Read More »మహిళకు రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయేషా 28 సంవత్సరాల గర్భిణీకి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన అంకాపు నవీన్ సాప్ట్ వేర్ ఇంజనీర్ సకాలంలో స్పందించి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్లు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలకు రక్తం లభించడం లేదని అలా ఎవరైనా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు అయితే వారు 9492874006 నెంబర్‌కి ...
Read More »మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో మౌలికవసతుల ఏర్పాట్ల కోసం మంజూరైన 63 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని స్మశాన వాటికల్లో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. మాంసాహార మార్కెట్ల ఏర్పాట్ల విషయంలో స్థలాన్ని పరిశీలించామని, టెండర్లు పూర్తవగానే త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
Read More »బీమా వందశాతం పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంట బీమా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎఈవోలు క్లస్టర్ పరిధిలోని రైతులందరికీ భీమా చేయాలని సూచించారు. పంట సాగు వివరాలు ఆన్లైన్లో వందశాతం నమోదు చేయాలని కోరారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పిట్లం మండలంలో 600 మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేటు డీలర్ల వద్ద ఉందని, లాక్ డౌన్ కారణంగా ...
Read More »ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు అన్ని వసతులు కల్పించాలి
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం తన ఛాంబర్లో పాలి సెట్ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 2 వ తేదీ ఉదయం 11.00 గంటల నుండి 1.30 గంటల వరకు నిర్వహించే పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులను పరీక్ష సెంటర్‌కు 10 గంటల నుండి అనుమతిస్తారని ...
Read More »దివ్యాంగుడికి ఆపన్నహస్తం
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో కోరుట్లకు చెందిన వినయ్ పరిస్థితి గురించి మాజీ ఎంపి కవిత తెలుసుకుని చలించిపోయారు. వినయ్‌తో మాట్లాడి భరోసా ఇచ్చారు. శనివారం మూడు చక్రాల స్కూటీని అందజేశారు. కవిత వెంట కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తదితరులున్నారు.
Read More »