Breaking News

మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయేషా 28 సంవత్సరాల‌ గర్భిణీకి అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తం బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన అంకాపు నవీన్‌ సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సకాలంలో స్పందించి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్లు రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు.

కరోనా వైరస్‌ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీల‌కు రక్తం ల‌భించడం లేదని అలా ఎవరైనా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నట్లు అయితే వారు 9492874006 నెంబర్‌కి సంప్రదించినట్లయితే వారికి కావల‌సిన రక్తాన్ని అందజేస్తామన్నారు. గత నాలుగు నెలల కాలంలో 220 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. రక్తదానానికి సహకరించిన ఏసుగౌడ్‌కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

అల‌క్ష్యం చేస్తే చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ...

Comment on the article