Breaking News

పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవు

కామారెడ్డి, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేషన్‌ దుకాణాల్లో కార్డు వినియోగదారులు బియ్యం తీసుకోవడానికి వస్తేనే వారి వేలిముద్రతో బియ్యాన్ని అందజేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ జనహిత భవనంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ప్రతి నెల‌ 20వ తేదీ వరకు బియ్యాన్ని డీల‌ర్లు వినియోగదారుల‌కు అందించాల‌ని సూచించారు.

బియ్యం పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరిగిన తహసీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రబీలో వడ్లను రైస్ మిల్లుల‌ ద్వారా సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 30 వరకు బియ్యం తయారు చేసే విధంగా అధికారులు చూడాల‌ని పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, ఆర్‌డివోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article