Breaking News

మంచి శాస్త్రవేత్తగా ఎదగాలి

నిజామాబాద్‌, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్‌ కాల్‌ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ఎన్నో అను వైజ్ఞానిక ప్రదర్శన ఈ సంవత్సరం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుండి 25 ప్రదర్శనలు నమోదు చేసుకోగా మహేందర్‌ ప్రదర్శన విద్యుత్‌ లేకుండా నీటిని ఎత్తిపోతల‌ యంత్రాన్ని తయారు చేశారు. ఈ ప్రదర్శన జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైంది.

కాగా సోమవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి చేతుల‌ మీదుగా విద్యార్థికి సర్టిఫికెట్‌ అందజేశారు. కలెక్టర్‌ విద్యార్థిని అభినందిస్తూ సమస్యలు పరిష్కరించడం కోసం సైన్సును విస్తృతంగా ఉపయోగించి మంచి శాస్త్రవేత్తగా ఎదగాల‌ని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్‌, జిల్లా సైన్స్‌ అధికారి కిషన్‌, గైడ్‌ టీచర్‌ రఘునందన్‌ పాల్గొన్నారు.

Check Also

రైతులను లాభాల బాటలోకి తెప్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లా రైతులను లాభాల బాటలో తెప్పించేందుకు డిసిసిబి ...

Comment on the article