Breaking News

ఉన్నతాధికారుల‌ ప్రశంసలు పొందారు

నిజామాబాద్‌, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ కార్యాల‌యంలో శాంతిభద్రతలు పరిరక్షించే ఎస్‌ఐ గాండ్ల విట్టల్‌కు పదవీ విరమణ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్లో ఎస్‌ఐ విటల్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు.

36 సంవత్సరాలు ఎస్‌ఐగా ఎన్నో ఉత్తమ సేవా పతకాల‌ను అందుకున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కలెక్టరేట్‌లో అంకితభావంతో పనిచేసి ఉన్నతాధికారుల‌ ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ఐ విట్టల్‌ సేవలందించినందుకు అభినందించారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article