Breaking News

జిల్లా ముఖ్య అధికారి జన్మదినం నేడు

కామారెడ్డి, ఆగష్టు 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన జన్మదినం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ జనహిత భవన్‌లో కేక్‌ కట్‌ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, వెంకటేష్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకుడు అజయ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వో శోభారాణి, వివిధ శాఖల‌ అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి కలెక్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాల‌ని కోరారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article