నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 ర్యాపిడ్ టెస్టులు చేయగా మాగి షుగర్ ఫ్యాక్టరీలో ఇద్దరు, అచ్చంపేట్ గ్రామంలో నలుగురికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్య అధికారి రాధాకిషన్ తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించాలన్నారు. లక్షణాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి తెలిపారు. నిజాంసాగర్ లో మొత్తం పాజిటివ్ కేసులు 238 కరోనాను జయించిన వారు.189 ...
Read More »Monthly Archives: September 2020
సోమవారం నాటికి పోలింగ్ స్టేషన్లు సిద్ధం కావాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాలలో పాల్గొనే పివోలు, ఓపివోలు, ఎస్‌వోఎస్ కు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.నారాయణ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. బుధవారం కొత్త అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన ఎన్నికల శిక్షణ శిబిరానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పివోలు ఎన్నికల్లో టీం లీడర్ వంటి వారని, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, సెక్టోరల్ ఆఫీసర్ ...
Read More »తెవివిలో కారుణ్య నియామకం
డిచ్పల్లి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మొట్ట మొదటి సారిగా కారుణ్య నియామకాన్ని చేపట్టారు. ఉపకులపతి సీనియర్ ఐఎఎస్ అధికారి నీతూ కుమారి ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం అవిశ్రాంత కషితో గవర్నమెంట్ జీఓలు అన్ని అడాఫ్ట్ (అనువర్తింప) చేసుకొని పాలక మండలి (ఎగ్జిక్యూటీవ్) సమావేశంలో కారుణ్య నియామకానికి అనుమతి తీసుకొన్నారు. మొట్టమొదటి కారుణ్య నియామక పత్రాన్ని దివంగత ఆచార్యులు బిజినెస్ మేనేజ్ మెంట్ డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణ చారి సతీమణి శ్రీవాణికి రిజిస్ట్రార్ ఆచార్య నసీం ...
Read More »వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు
నిజాంసాగర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు పదహారు రోజులుగా అలుగు పొంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఎల్లారెడ్డి- మెదక్ ప్రధాన రహదారిపైనుంచి నీరు పారడంతో రోడ్డు గుంతలమయమైంది. రహదారి గుండా వాహనదారులు అలుగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలో పడి వాహనదారులకు గాయాలైన సంఘటనలు కూడా చాలా చోటు చేసుకున్నాయి. రాత్రి వేళల్లో రహదారి గుండా రావడానికి వాహనదారులు జంకుతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చెరువు కట్టపై ...
Read More »కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాటం
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సత్యశోధక్ సమాజ్ 148 వ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఐఎఫ్టియు, ఏఐకెఎంఎస్, సిఎస్సి, పిడిఎస్యు, పివైఎల్, పివోడబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో ఎన్. ఆర్ భవన్, కోటగల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం.వెంకన్న మాట్లాడుతూ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేలు దళితులు, నిమ్న కులాలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఇన్నేళ్ళయినా దేశంలో కుల దురహంకార దాడులు మరింత పెరుగుతున్నాయన్నారు. మొన్న ప్రణయ్, నిన్న హేమంత్ల హత్యలు ...
Read More »బిజెపి సంబరాలు… వారంతా నిర్దోషులే
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాబ్రీ మసీదు కేసులో వారంతా నిర్దోషులని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు పట్ల కామారెడ్డి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో సంబరాలు చేసుకోని మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించడం సంతోషమన్నారు. బాబ్రీ మసీదు ...
Read More »పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనర్ ఐపిఎస్ కార్తికేయ సమాచారం మేరకు నిజామాబాద్ పోలీసులు ఒరిస్సాకు చెందిన ఒక కార్, ఒక మహేంద్ర బొలెరో ట్రక్కులో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 35 ప్యాకెట్లలో సుమారు 15 లక్షల నుండి 16 లక్షల విలువ గల 152 కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి 9 సెల్పోన్లు, 1000 రూపాయల నగదు, హుందాయ్ ఐ 20 కార్, బి.నెం. ఓడి ...
Read More »వాట్సాప్ ద్వారా సందేహ నివృత్తి చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆన్లైన్ తరగతులు కేజీబీవీ విద్యార్థినులు వినే విధంగా ఉపాధ్యాయులు చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సూచించారు. మంగళవారం కేజీబీవీ ప్రత్యేక అధికారిణులు, మండల విద్యాధికారులతో ఆయన ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్దినుల సందేహాలను వాట్సాప్ ద్వారా నివత్తి చేయాలని, అనాధ, తల్లి లేదా తండ్రి మతి చెందిన బాలికలు, నిరుపేదలుంటే హైదరాబాదులో పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత పొందిన అర్హత గల బాలికలు ...
Read More »రైతు కల్లాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లోని నర్సరీలలో పదివేల మొక్కలకు పైన పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులకు తెలిపారు. కలెక్టర్ చాంబర్లో మంగళవారం పల్లె ప్రగతిపై ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన ప్రతి మొక్కను సంరక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. రైతుకల్లాలు ప్రతి పంచాయతీ కార్యదర్శి ఐదు చొప్పున పూర్తిచేసే విధంగా చూడాలని కోరారు. ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడు ఇరవై ఐదు చొప్పున రైతు కల్లాలనును పూర్తిచేయాలని ...
Read More »తక్కువ బరువున్న పిల్లలను గుర్తించాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో నమోదు చేసుకున్న పిల్లలను ప్రతి నెలా క్రమం తప్పకుండా బరువు తూకం వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. మంగళవారం అంగన్వాడి అధికారులతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తక్కువ బరువు ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ఆవరణలో పోషకాహారం కలిగిన కూరగాయలను పెంచుకోవాలని కోరారు. జిల్లా శిశు సంక్షేమ అధికారిణి అనురాధ, సిడిపివోలు, పర్యవేక్షణ ...
Read More »మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి వంద శాతం రాయితీపై సమీకత మత్స్య అభివద్ధి పథకం ద్వారా చేప పిల్లలు పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఆయన చేప పిల్లలు వదిలే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. వలలు, వాహనాలు ప్రభుత్వం మత్స్యకారులకు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో 48 లక్షలు చేప పిల్లలు వేయాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. రొయ్య పిల్లలను ప్రాజెక్టులో ...
Read More »ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దుచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి తహసీల్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని పేద ప్రజలపై వేసిన పన్నులను వెంటనే రద్దు చేయాలని నాయకులు నినాదాలు చేశారు. సిఎం కెసిఆర్ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందన్నారు. పేదల పార్టీ బిజెపి అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారని, వారికి అర్థమైంది తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను గద్దె ...
Read More »ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి
నిజాంసాగర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకతి వనాలలో మరిన్ని మొక్కలను ఉద్యమంలా నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ అన్నారు. నిజాంసాగర్ మండలం ఆరేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల పల్లె ప్రకతి వనంలో మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రకతి వనంలో ఎక్కువ మొక్కలు నాటాలని, నాటిన ప్రతి ఒక్క మొక్క సంరక్షణ పకడ్బందీగా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కలెక్టర్ ...
Read More »దోపిడీ వ్యవస్థ నిర్మూలనతోనే కులాల నిర్మూలన
బోధన్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత దేశంలో గల దోపిడి వ్యవస్థ నిర్మూలనతోనే దేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరుగుతుందని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ అన్నారు. మంగళవారం బోధన్ మండలం ఖాజాపూర్ గ్రామంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల నిర్మూలన సభలో వి.ప్రభాకర్ మాట్లాడారు. అనాదిగా దేశంలో మనువాద బ్రాహ్మణీయ భావజాలం నిచెన మెట్ల కులవ్యవస్థ రూపంలో క్రింది కూలాల పైన, ...
Read More »ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా లోకల్ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్, కోఆపరేటివ్ శాఖ కమిషనర్ మరియు రిజిస్ట్రార్ వీరబ్రహ్మయ్య పరిశీలించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో టెంటు, డయాస్, పబ్లిక్ ...
Read More »పరీక్ష కేంద్రం తనిఖీ
భీమ్‌గల్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో తతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం భీమ్‌గల్ నలంద డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాలను తెలంగాణ యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ కనకయ్య, జాయింట్ డైరెక్టర్ రాం బాబు తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల్లో వైరస్ ప్రబలకుండ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా యాజమాన్యాలు ఏవిధమైన ఏర్పాట్లు ...
Read More »బంగారు, వెండి జరీ అంచులతో బతుకమ్మ చీరలు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగకు చిరు కానుకగా ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 9 ...
Read More »ఎన్నికల అబ్జర్వర్ నిజామాబాద్ వచ్చారు…
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిజామాబాద్ జిల్లా లోకల్ అథారిటీ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలించడానికి జనరల్ అబ్సర్వర్గా నియమితులైన కమిషనర్ మరియు రిజిస్ట్రార్, సహకార శాఖ, తెలంగాణ ప్రభుత్వం వీర బ్రహ్మయ్య నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఉన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉన్నచో సాధారణ ఎన్నికల పరిశీలకుల ఫోన్ నెంబర్ 9491007423 కి తెలియ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ ...
Read More »చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
నిజాంసాగర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల హెడ్స్ లూస్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు చిరుత సంచరించడం పట్ల భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం జీవాలను జీవలదారులు మేపేందుకు తీసుకుని వెళుతుంటారు, చిరుతపులి సంచరించడం పట్ల జీవలదారులు సైతం భయాందోళనలకు చెందుతూ జీవాలను మేపుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి ...
Read More »నిజాంసాగర్‌లో 1396.64 అడుగుల నీటి మట్టం
నిజాంసాగర్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులకు గాను 1396.64 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 8.135 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు 6914 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల గాను, 522.425 మీటర్ల నీటి మట్టం, అలాగే 29.917 టీఎంసీలకు గాను 23.705 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు ...
Read More »