Breaking News

రాష్ట్రంలో కామారెడ్డి ఫస్ట్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల‌కు రూ.19 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో మంగళవారం ఐకెపి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్‌ రుణాల ల‌క్ష్యం‌ రూ.57 కోట్లకు ఇప్పటివరకు రూ.30 కోట్లు అందజేసినట్లు తెలిపారు.

56 శాతం ల‌క్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ల‌క్ష్యాన్ని సాధించే విధంగా అధికారులు కృషి చేయాల‌ని కోరారు. మండలాల‌ వారీగా కోవిడ్‌ రుణాల‌పై సమీక్ష నిర్వహించారు. రూ.214 కోట్ల సాధారణ రుణాల‌కు స్వయం సహాయక సంఘాల‌కు ఇప్పటివరకు రూ.190 కోట్లు అందజేసినట్లు చెప్పారు. 89 శాతం ల‌క్ష్యాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article