కామారెడ్డి, సెప్టెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రకృతి వనాలతో నూతన శోభ వచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లిలోని పల్లె ప్రకృతి వనంను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలతో పల్లెల్లో నూతన శోభను సంతరించుకోనున్నాయని చెప్పారు. ప్రకృతి వనంలో బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. గుట్ట సమీపంలో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రతి వెయ్యి మొక్కలకు ఒక వన సంరక్షకుడు ఏర్పాటుచేసి నెలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. భూంపల్లి అంబరీషుని గుట్టపై ఉన్న పల్లె ప్రకృతి వనంలో ఐదు వేల మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామంలో కంపోస్ట్ షెడ్డు పనులను పూర్తి చేసి సేంద్రియ ఎరువులను తయారు చేయాలని కోరారు. సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పేర్కొన్నారు.
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచాలని సూచించారు. బోరు వేయించాలని ప్రజా ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గ్రామీణ నీటి సరఫరాల శాఖ అధికారులను బోరు వేయించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డివో చంద్రమోహన్ రెడ్డి, డిపిఓ నరేష్, ఎంపీపీ అనసూయ, సర్పంచ్ లలితా బాయ్, ఉప సర్పంచ్ సాయిలు, ఎంపీడీవో అశోక్, తహసీల్దార్ రవీందర్, అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021