Breaking News

ఆందోళన అవసరంలేదు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యూరియా డిమాండ్‌ దృష్టిలో ఉంచుకొని అవసరమైన యూరియాను వెంటనే కేటాయించేలా చర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డిని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కలెక్టర్‌ విన్నవించడం మేరకు మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వం ద్వారా జిల్లాకి మూడు ర్యాక్ల‌‌ యూరియా పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. క్రిబ్‌కో ద్వారా 548 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌ఎఫ్‌సిఎల్‌ ద్వారా 500, ఎన్‌ఎఫ్‌ఎల్‌ ద్వారా 1200 మెట్రిక్‌ టన్నులు వెరసి మొత్తం 2248 మెట్రిక్‌ టన్నులు మంగళవారం రాత్రి వరకు జిల్లాకు చేరుకోనున్నదన్నారు.

దానిని వీలైనంత త్వరగా అన్‌లోడ్‌ చేయించి అన్ని సొసైటీల‌కు పంపించడం జరుగుతుందని, గురువారం నుండి అన్ని సొసైటీల్లో మరియు ప్రైవేటు డీల‌ర్ల దగ్గర యూరియా అందుబాటులో ఉంటుందన్నారు. కావున రైతులు ఎవరూ యూరియా గురించి ఆందోళన చెందవల‌సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన ద్వారా వివరించారు.

Check Also

గంటకు రూ.2500 లకు మించి వసూలు చేయరాదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో 2020 వానా కాలపు వరి పంటలకు ...

Comment on the article