Breaking News

దీంతో గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి మండలం, సిర్నాపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. మంగళవారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా సిర్నాపల్లి గ్రామం సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాల‌యం ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో హరిత హారం మొక్కలు పరిశీలించారు. పాఠశాల‌ ఆవరణంలో మియవాకి మినీ ఫారెస్ట్‌ పరిశీలించారు.

గ్రామ పంచాయతీలో నగరాల‌లో లేనటువంటి పార్కు తయారు చేసుకోవాల‌న్నారు. డంపింగ్‌ యార్డ్‌ సందర్శించిన అనంతరం మాట్లాడుతూ మియావాకి ప్లాంటేషన్లో భాగంగా నాలుగు వందల‌ స్క్వేర్‌ యార్డ్స్‌ స్థలంలో మొక్కలు పెంచడం, అవి ఏ విధంగా పెరిగాయో చూడడం కోసం ఇక్కడికి రావడం జరిగిందని, గత సంవత్సరం ఆగస్టు నెల‌లో పెట్టిన మొక్కలు 14 ఫీట్ల వరకు పెరిగాయని, ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు అన్ని గ్రామ పంచాయతీల‌లో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ చేస్తున్నామని, పల్లె ప్రకృతి వనం కాన్సెప్ట్‌ ఎకరవం స్థల‌ముంటే నాలుగు వేల‌ మొక్కలు నాటాల‌ని, అర ఎకరం ఉంటే రెండు వేల‌ మొక్కలు నాటాల‌ని, దాన్ని పార్కులా మార్చుకోవాల‌ని, సిర్నపల్లి గ్రామపంచాయతీ నాటిన మొక్కల‌ను మోడల్‌గా తీసుకుని ప్రతి గ్రామపంచాయతీలో డెన్స్‌ ప్లాంటేషన్‌ చేయాల‌న్నారు.

మొక్కల‌ను సంరక్షించుకునేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుండి వన సేవకుల‌ను మన జిల్లాలో మూడు వేల‌ మందిని నియమించామని, మొక్కలు పెంచే పనిని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్‌ తీసుకోవాల‌ని, గ్రామం ఎంత పచ్చగా ఉంది, ఎంత పరిశుభ్రంగా ఉందనేది ముఖ్యమని, సెగ్రిగేషన్‌ షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌ నిర్మించు కొన్నామని, వాటి ద్వారా డ్రై వేస్టు, వెట్‌ వేస్ట్‌ వేరువేరుగా కలెక్ట్‌ చేయాల‌ని, ప్రతి ఇంటి నుండి చెత్త వేరువేరుగా ఇచ్చే విధంగా చెత్తబుట్టలు ఇవ్వాల‌ని, వారు వేరు చేసి జిపి ట్రాక్టర్‌కు ఇవ్వాల‌ని, తడి చెత్త పొడి చెత్త సేకరించిన తర్వాత గ్రామానికి సంబంధించిన షెడ్యూల్‌ ప్రకారం తడి చెత్త కంపోస్టు ఎరువుగా మార్చుటకు చర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

ఇప్పటికే చాలా గ్రామాల‌లో స్టార్ట్‌ అయిందని, అన్ని గ్రామాల‌లో చేసే విధంగా ముందుకు సాగాల‌ని, పొడి చెత్తను రీసైకిల్‌ చేసే విధంగా ప్లాస్టిక్‌, గాజు, అట్టముక్కలు వేరు వేరు చేయాల‌న్నారు. కంపోస్టు ఎరువులు తయారు చేయడం వన గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుందని, రానున్న రోజుల్లో జీరో వేస్ట్‌ అనే కాన్సెప్ట్‌కి వెళ్ళాల‌ని, పల్లె ప్రకృతి వనాలు నాలుగు వందల‌ ముప్పై గ్రామపంచాయతీల్లో స్టార్ట్‌ చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ విజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో రాములు నాయక్‌, ఎంపిఓ సుభాష్‌ చంద్రబోస్‌, సెక్రటరీ అశోక్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కరుణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు ...

Comment on the article