Breaking News

Daily Archives: September 2, 2020

బీర్కూర్‌లో కరోనా పాజిటివ్‌ 18, నెగిటివ్‌ 61

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బీర్కూర్‌లో నిర్వహించిన కరోనా రాపిడ్‌ టెస్టుల్లో 18 మందికి పాజిటివ్‌, 61 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్నారం 8, బీర్కూర్‌ 4, నాచుపల్లి 3, హాజిపూర్‌ 1, బొమ్మన్‌దేవుపల్లి 1, అంకోల్‌ 1 కేసులు నమోదైనట్టు తెలిపారు.

Read More »

ప్రశాంతంగా ముగిసింది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాల‌లో మొదటి సంవత్సరం ప్రవేశాల‌ కోసం నిర్వహించిన పాలిసెట్‌- 2020 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీరాంకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల‌కు మొత్తం విద్యార్థులు 3552కు గాను 2779 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా 78.24 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. పరీక్షల‌ను జిల్లా కో ఆర్డినేటర్‌, ప్రిన్సిపాల్‌ శ్రీరాంకుమార్‌, అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ పి.శ్రీకర్‌, జిల్లా ప్రత్యేక ...

Read More »

15 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అని డిగ్రీ కళాశాల‌లోని ఇయర్‌ వైస్‌ బిఏ, బికాం (జనరల్‌), బికాం (కంప్యూటర్స్‌), బికాం (ఒకేషనల్‌), బిఎస్సి, బిఎస్సి ( కంప్యూటర్స్‌), బిబిఎ, బిఎ (ఎల్‌) కోర్సుకు మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల‌లో బ్యాక్‌ లాగ్‌ పరీక్ష కోసం ఫీజు గడువు ఈ నెల‌ 15 వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 100 రుపాయల ఆల‌స్యపు రుసుముతో ...

Read More »

దరఖాస్తు గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాల‌ వయసు నిండిన వారు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల‌ కోరిక మేరకు ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల‌ 7వ తేదీ వరకు గడువు పెంచినట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా 9 అధ్యయన కేంద్రాల్లో నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌, కామారెడ్డి, మోర్తాడ్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, భీంగల్‌లో తమకు ...

Read More »

3న సర్టిఫికెట్ల దృవీకరణ

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోస్త్‌ 2020-21 అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక వర్గ విద్యార్థులు 3వ తేదీ గురువారం యూనివర్సిటీ హెల్ప్‌లైన్‌ సెంటర్‌, తెలంగాణ యూనివర్సిటీలో దృవీకరణ ఉదయం 10 గంటల‌ నుండి జరుగుతుందని కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.బాల‌కిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్‌సిసి విద్యార్థుల‌కు 4వ తేదీ శుక్రవారం దృవీకరణ జనరుగుతుందన్నారు. పిహెచ్‌, సిఏపి, ఎన్‌సిసి సర్టిఫికెట్‌ కలిగి ఉన్న వారు మొదటి విడతలో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నవారు తప్పకుండా తెలిపిన ...

Read More »

బ్యాంకు నుంచి ఇప్పించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల‌ రైతుల‌కు పంట రుణాల‌ను వ్యవసాయ అధికారులు బ్యాంకు నుంచి ఇప్పించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల‌ వ్యవధిలో అన్ని మండలాల్లో 75 శాతం మంది రైతుల‌కు పంట రుణాలు అందే విధంగా చూడాల‌ని సూచించారు. బ్యాంకులో రైతు పెండిరగ్‌ రుణాలు ఉంటే వన్‌ టైం సెటిల్మెంట్‌ చేయాల‌ని సూచించారు. వారికి తిరిగి రుణాలు ఇప్పించాల‌ని ...

Read More »