Breaking News

15 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అని డిగ్రీ కళాశాల‌లోని ఇయర్‌ వైస్‌ బిఏ, బికాం (జనరల్‌), బికాం (కంప్యూటర్స్‌), బికాం (ఒకేషనల్‌), బిఎస్సి, బిఎస్సి ( కంప్యూటర్స్‌), బిబిఎ, బిఎ (ఎల్‌) కోర్సుకు మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల‌లో బ్యాక్‌ లాగ్‌ పరీక్ష కోసం ఫీజు గడువు ఈ నెల‌ 15 వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

100 రుపాయల ఆల‌స్యపు రుసుముతో ఈ నెల‌ 19 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. షెడ్యూల్‌ 2011-12 నుంచి 2015-16 విద్యా సంవత్సరం వరకు ఉన్న ఇయర్‌ వైస్‌ డిగ్రీ విద్యార్థుల‌కు మాత్రమే చెందుతుందన్నారు. పూర్తి వివరాల‌కు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ సందర్శించాల‌న్నారు.

Check Also

బేషరతుగా విడుదల‌ చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై ...

Comment on the article