నిజామాబాద్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాల వయసు నిండిన వారు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల కోరిక మేరకు ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 7వ తేదీ వరకు గడువు పెంచినట్టు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 9 అధ్యయన కేంద్రాల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోదన్, కామారెడ్డి, మోర్తాడ్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, భీంగల్లో తమకు నచ్చిన అద్యయన కేంద్రంలో డిగ్రీ విద్య అభ్యసించవచ్చన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారు, చదువు మధ్యలో ఆపేసిన వారు డిగ్రీ ప్రవేశం కొరకు ప్రవేశ అర్హత పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7382929612 నెంబర్లో సంప్రదించాలన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021